గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 10, 2020 , 09:20:17

సౌతాఫ్రికాలో భూకంపం

సౌతాఫ్రికాలో భూకంపం

జోహన్స్‌బర్గ్‌ : ఆఫ్రికా ఖండంలోని నైరుతి ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి  భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) ట్వీట్ చేసింది. నౌరుతి ప్రాంతానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని  ఆ సంస్థ పేర్కొంది.  ఈ ప్రాంతంలో భూకంపాలు కొంత అరుదుగా వస్తుంటాయని, వెస్టిండీస్‌లో‌ని  కొన్ని ప్రాంతాల్లో ఈ లోతులో తరచూ ప్రకంపనలు చోటు చేసుకోవడం సహజమని తెలిపింది.  కానీ ఈ ప్రాంతంలో ఇంత లోతులో భూకంపం సంభవించడం కచ్చితంగా చాలా అరుదని వెల్లడించింది. 


logo