సోమవారం 18 జనవరి 2021
International - Dec 02, 2020 , 08:28:54

అమెరికాలో భూకంపం

అమెరికాలో భూకంపం

వాషింగ్టన్‌ : అమెరికాలోని నెవాడాలోని మినాకు దక్షిణానికి 24 కిలోమీటర్ల వేగంతో 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్‌) మంగళవారం తెలిపింది. యూఎస్‌జీఎస్‌ ప్రకారం.. మంగళవారం రాత్రి 11.23గంటల ప్రాంతంలో జీఎంటీ వద్ద ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం, 10.2 కిలోమీటర్ల లోతుతో గుర్తించినట్లు జియోలాజికల్‌ సర్వే అధికారులు పేర్కొన్నారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. అలాగే అంతకు ముందు దక్షిణ అలస్కాలోనూ 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.