గురువారం 04 జూన్ 2020
International - Apr 13, 2020 , 10:23:22

2 హాస్పిట‌ళ్ల‌తో లింకున్న 5 వేల మంది క్వారెంటైన్ !

2 హాస్పిట‌ళ్ల‌తో లింకున్న 5 వేల మంది క్వారెంటైన్ !

హైద‌రాబాద్‌: వైర‌స్ సోకితే క్వారెంటైన్ కావాల్సిందే.  కేసు సీరియ‌స్ అయితే.. వారికి హాస్పిట‌ల్ ట్రీట్మెంట్ త‌ప్ప‌దు. ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలో సుమారు 5వేల మందిని క్వారెంటైన్ చేయ‌నున్నారు.  ఆ రాష్ట్రంలో ఇటీవ‌ల ఎక్కువ కేసులు న‌మోదు అయ్యాయి. వాటి గురించి అధికారులు ఆరా తీస్తే.. రెండు హాస్పిట‌ళ్ల నుంచి ఎక్కువ‌గా కేసుల‌తో లింకులు ఉన్న‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  దీంతో బ‌ర్నీలోని నార్త్ వెస్ట్ రీజిన‌ల్ హాస్పిట‌ల్‌, నార్త్ వెస్ట్ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు చెందిన 1200 మంది ఉద్యోగుల‌ను క్వారెంట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. వారితో పాటు వారి ఇంటి స‌భ్యుల‌ను కూడా రెండు వారాల పాటు నిఘాలో పెట్ట‌నున్నారు.  ఆ హాస్పిటిల్ సిబ్బంది, ఇంటి స‌భ్యులు మొత్తం క‌లిపి 5వేల మందిని క్వారెంటైన్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇదొక్క‌టే ఉత్త‌మ మార్గం అని రాష్ట్ర మంత్రి పీట‌ర్ గుట్విన్ తెలిపారు. 


logo