సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 14:52:35

ముగింపు ద‌శ‌లో భార‌త్‌-జ‌పాన్ నావికా విన్యాసాలు

ముగింపు ద‌శ‌లో భార‌త్‌-జ‌పాన్ నావికా విన్యాసాలు

న్యూఢిల్లీ: భార‌త్-జ‌పాన్ దేశాల సంయుక్త నావికా విన్యాసాలు కొన‌సాగుతున్నాయి. భార‌త నావికా ద‌ళం, జ‌ప‌నీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్‌) సంయుక్తంగా జిమెక్స్ పేరుతో ఈ నావికా విన్యాసాలను చేప‌ట్టాయి. ఉత్త‌ర అరేబియా స‌ముద్రంలో గ‌త మూడు రోజులుగా ఈ నేవ‌ల్ ఎక్స‌ర్‌సైజెస్ జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా భార‌త్‌-జ‌పాన్ దేశాల‌కు చెందిన నౌక‌లు వీప‌న్ డ్రిల్స్‌, సీమ్యాన్‌షిప్ ఎవాల్యూష‌న్స్‌, అడ్వాన్స్‌డ్ ఎక్స‌ర్‌సైజెస్ నిర్వ‌హిస్తున్నాయి. 

సెప్టెంబ‌ర్ 26న ప్రారంభ‌మైన ఈ సంయుక్త నావికా విన్యాసాలు నేటితో ముగియ‌నున్నాయి. కాగా, భార‌త్ జ‌పాన్ దేశాలు సంయుక్తంగా నేవ‌ల్ ఎక్స్‌ర్ సైజెస్ చేప‌ట్ట‌డం ఇది నాలుగోసారి.    ‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo