సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 20, 2020 , 00:59:03

చంద్రుడిపై 4జీ నెట్‌వర్క్‌

చంద్రుడిపై 4జీ నెట్‌వర్క్‌

  • నాసా కోసం సిద్ధం చేస్తున్న నోకియా

లండన్‌: చందమామపై 4జీ సెల్యులార్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ నోకియా ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కోసం ఈ నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది. అంగారకుడిపైకి మనుషులను పంపే ప్రయత్నాల్లో ఉన్న నాసా, అందుకు చంద్రుడిని ఒక స్తావరంగా మార్చుకోవాలని ప్రణాళికలు వేస్తున్నది. చంద్రుడిపై కొంతకాలం నివాసం ఉండే మనుషులకోసం 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేయనున్నది. భూమిపై పూర్తిగా సిద్ధం చేసిన నెట్‌వర్క్‌ పరికరాలను 2022 సంవత్సరాంతంలో చంద్రుడిపైకి తీసుకెళ్లి అమర్చుతారు. ఈ నెట్‌వర్క్‌ తయారీకి నోకియాకు నాసా దాదాపు రూ.1000 కోట్లు చెల్లిస్తున్నది. చంద్రుడిపై మనిషి మనుగడకు కమ్యూనికేషన్‌ వ్యవస్థ అవసరమని నోకియా చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మార్కస్‌ వెల్డన్‌ అన్నారు. నోకియా తయారుచేస్తున్న 4జీ నెట్‌వర్క్‌లో వ్యోమగాములు ఉండేందుకు స్థావరం, యాంటెన్నాలు ఉన్నాయి.