బుధవారం 03 జూన్ 2020
International - Apr 01, 2020 , 08:43:09

క‌రోనా ఎఫెక్ట్‌: ఫ‌్రాన్స్‌లో ఒకేరోజు 499 మంది మృతి

క‌రోనా ఎఫెక్ట్‌: ఫ‌్రాన్స్‌లో ఒకేరోజు 499 మంది మృతి

న్యూఢిల్లీ: ప‌్ర‌పంచ దేశాల్లో క‌రోనా ర‌క్క‌సి క‌రాళ నృత్యం చేస్తూనే ఉన్న‌ది. ముఖ్యంగా ఇట‌లీ, స్పెయిన్‌, అమెరికా దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఆ త‌ర్వాత క‌రోనా ప్ర‌భావం అంత ఎక్కువ‌గా ఉన్న‌ది ఫ్రాన్స్ పైన‌నే. క‌రోనా బారిన‌ప‌డి మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఫ్రాన్స్‌లో 499 మంది మృతిచెందారు. దీంతో క‌రోనా కార‌ణంగా ఫ్రాన్స్‌లో మరణించిన వారి మొత్తం సంఖ్య 3,523 కు చేరింది. 

మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఫ్రాన్స్‌లో ఎక్కువగానే ఉన్న‌ది. మంగళ‌వారం నాటికి అక్క‌డ 22,757 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. వారంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, వారిలో 5,565 మందిలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున‌ ప్ర‌త్యేక క్వారెంటైన్ సెంట‌ర్ల‌లో ఉంచి వైద్యులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఫ్రాన్స్ ఆరోగ్య విభాగం అధికారి జెరోమ్ స‌లోమ‌న్ తెలిపారు. 


logo