గురువారం 28 మే 2020
International - May 02, 2020 , 14:03:14

వెనుజువెలా జైలులో అల్లర్లు.. 46 మంది మృతి

వెనుజువెలా జైలులో అల్లర్లు.. 46 మంది మృతి

వెనుజువెలాలోని ఓ జైలులో అల్లర్లు చెలరేగటంతో 46 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారి వెల్లడించారు.  కొంతమంది ఖైదీలు గ్వానారేలోని లాస్ లానోస్ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అల్లర్లు చెలరేగాయి. ఈ జైలు ఉన్న ప్రాంతం రాజధాని కారకాస్‌కు  ఆగ్నేయంగా 500 కి.మీ. దూరంలో ఉంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారి వెల్లడించారు.  జైలు ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నిస్తుండటంతో జవాన్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడటంతో ఖైదీలు మృతిచెందారు. 


logo