శుక్రవారం 15 జనవరి 2021
International - Jan 03, 2021 , 18:05:40

ఆలయం కూల్చివేత కేసులో మరో 45 మంది అరెస్టు

ఆలయం కూల్చివేత కేసులో మరో 45 మంది అరెస్టు

పెషావర్‌ : పాకిస్థాన్‌లో హిందూ ఆలయం కూల్చివేసిన కేసులో అక్కడి పోలీసులు మరో 45 మందిని అరెస్టు చేశారు. దీంతో ఆలయం కూల్చివేత కేసులో అరెస్టుల సంఖ్య వందకు చేరింది. కేసులో మరో 350 మంది వ్యక్తుల పేర్లను పోలీసులు తాజాగా చేర్చారు. రాడికల్‌ ఇస్లామిక్‌ కార్యకర్తలు గతేడాది డిసెంబర్‌ 30న ఖైబర్‌ ప్రావిన్స్‌లో గుడిని కూల్చి నిప్పుపెట్టారు. ఆలయం కూల్చివేత ఘటనపై భారత్‌ తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. నిరసన తెలుపుతూ భారత దౌత్యాధికారులు పాక్‌కు లేఖ రాశారు.