సోమవారం 08 మార్చి 2021
International - Jan 25, 2021 , 12:47:05

చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..

చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..

అది 1979 నవంబర్ 4వ తేదీ.. ఇరాన్‌ రాజధాని టెహరాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం. సాయుధులై పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం రాడికల్‌ విద్యార్థులు ఒక్కసారిగా చుట్టుముట్టి అక్కడి దౌత్యవేత్తలు, ఉద్యోగులు 52 మందిని బందీలుగా చేశారు. వీరందిరినీ 1 ఏడాది 2 నెలల 2 వారాల 2రోజుల పాటు అనగా 444 రోజుల పాటు.. 1981 జనవరి 20 వ తేదీ వరకు బందీలు ఉంచుకున్నారు. సరిగ్గా ఇదే రోజున ప్రాణాలతో అమెరికా చేరుకున్నారు. ప్రపంచ చరిత్రలో ఇదే అతిపెద్ద బందీగా పేర్కొంటారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి సరిగ్గా 41 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడుగా జిమ్మీ కార్టర్ ఉన్నారు. వివిధ దౌత్య ప్రయత్నాలు చేసిప్పటికీ.. తమ దేశ పౌరులను రక్షించడంలో జిమ్మీ కార్టర్‌ విఫలమయ్యారు. అనంతరం ఈగిల్ క్లా మిషన్ ప్రారంభించినప్పటికీ.. ఈ మిషన్ కూడా విఫలమైంది. దీనిలో 8 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో ఇరాన్‌ అధినేత షా పహ్లావి క్యాన్సర్‌ కారణంగా మరణించారు. అయినప్పటికీ, ఇరాన్‌లో సంక్షోభం అలాగే కొనసాగింది. 1980 లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగ్గా.. జిమ్మీ కార్టర్ ఓటమిపాలై.. రోనాల్డ్ రీగన్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రీగన్‌ వచ్చిన వెంటనే బందీలను విడిపించేందుకు ఇరాన్‌తో చర్చలు ప్రారంభించారు. అమెరికా స్వాధీనం చేసుకున్న 8 బిలియన్ డాలర్ల ఇరానియన్ ఆస్తిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అంగీకరించింది. దాంతో 444 రోజులపాటు బందీలుగా పెట్టుకున్న అమెరికా దౌత్యవేత్తలు, ఉద్యోగులను విడుదల చేశారు. వీరంతా 5 రోజుల తరువాత జనవరి 25 న ఇళ్లకు చేరుకున్నారు.

వాక్యూమ్ పంప్‌ను కనుగొన్నాడీయన


వాక్యూమ్ పంప్‌ను కనుగొన్న రాబర్ట్ బాయిల్ 1627 లో సరిగ్గా ఇదే రోజున ఐర్లాండ్‌లోని మన్‌స్టర్ నగరంలో జన్మించారు. చిన్నతనం నుండే చదువుల్లో ముందుండే రాబర్ట్‌కు.. ఫ్రెంచ్, లాటిన్, ఇంగ్లిషు భాషల్లో నైపుణ్యం ఉన్నది. అదనంగా హీబ్రూ, గ్రీక్, సిరియాక్ భాషలను కూడా నేర్చుకున్నారు. వివిధ భాషలను నేర్చుకోవడం ద్వారా ప్రతి రంగంలోనూ తన జ్ఞానాన్ని పెంచుకున్నారు. అతను తన ప్రారంభ విద్యను ఏటన్ కలీల్ స్కూల్ నుండి పొందారు. మూడు సంవత్సరాల తరువాత అతను ఐరోపా పర్యటనకు వెళ్లి.. 14 సంవత్సరాల వయస్సులో ఉండగా.. 1641 లో ప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియోను కలిశారు. ఇక్కడి నుండే రాబర్ట్ తన జీవితమంతా సైన్స్ కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన రాబర్ట్ బాయిల్‌.. రాబర్ట్ బాయిల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రముఖ శాస్త్రవేత్తగా నిలిచారు. ఈ నియమం ప్రకారం, ఒత్తిడి తగ్గడం, పెగడం కారణంగా గాలిలో మార్పు వస్తుందన్నారు. ఈ నియమం ఆధారంగా అనేక ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం ఈ సిద్ధాంతం సైన్స్‌లో చాలా ఉపయోగిస్తున్నారు. అతను 1691 డిసెంబర్ 30 న మరణించాడు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు

2015: 2014 మిస్ యూనివర్స్‌గా ఎంపికైన మిస్ కొలంబియా పోలినా వేగా

2005: మహారాష్ట్రలోని సతారాలోని ఒక ఆలయంలో తొక్కిసలాట, 300 మందికి పైగా మరణం

2002: భారత వైమానిక మొట్టమొదటి 'ఎయిర్ ఫోర్స్ మార్షల్'గా నియమితులైన అర్జున్ సింగ్ 

2001: భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయరాజే సింధియా మరణం

1983: ఆచార్య వినోబా భావేకు భారతరత్న అవార్డు ప్రదానం

1980: మదర్ థెరిసాకు భారతరత్న ప్రదానం

1975: బంగ్లాదేశ్ అధ్యక్షుడైన షేక్ ముజీబర్ రెహ్మాన్ 

1971: 18వ రాష్ట్రంగా అవతరించిన హిమాచల్ ప్రదేశ్

1958: భారతీయ ప్లేబ్యాక్ సింగర్‌ కవితా కృష్ణమూర్తి జననం

1839: చిలీలో సంభవించిన భూకంపం.. 10,000 మంది మరణం

1755: మాస్కో విశ్వవిద్యాలయం స్థాపన

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo