శుక్రవారం 05 జూన్ 2020
International - May 11, 2020 , 08:25:13

కరోనా వైరస్‌ గుప్పిట్లో ప్రపంచ దేశాలు

కరోనా వైరస్‌ గుప్పిట్లో ప్రపంచ దేశాలు

పారిస్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో శాంతించేలా కనిపించడం లేదు. కొన్ని దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో వీటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 41,80,303కు చేరింది. ఇందులో 2,83,860 మంది బాధితులు మరణించారు. ప్రాణాంతక వైరస్‌ బారినుంచి 14,90,776 కోలుకుని డిశ్చార్చికాగా, మరో 24,05,667 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 13,67,638 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ వైరస్‌ వల్ల 80787 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో 776 మంది మృతిచెందారు. దేశంలో ఇంకా 10,30,515 కరోనా పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా కేసుల విషయంలో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,64,663 మంది ఈ వైరస్‌ బారిన పడగా, ఇప్పటివరకు 26,621 మంది మరణించారు. మరో 61,603 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,76,439 మంది బాధితులు కోలుకున్నారు. 

యూకేలో 2,19,183 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ వల్ల 31,855 మంది బాధితులు మృతిచెందారు. ఇటలీలో ఇప్పటివరకు 2,19,070 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన 30,560 మంది మరణించారు.

ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రష్యాలో 2,09,688 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో ఇప్పటివరకు 1915 మరణించారు. 1,73,467 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 34,306 మంది బాధితులు కోలుకున్నారు. బ్రెజిల్‌లో 1,62,699 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇప్పటివరకు 11,123 మంది మరణించారు. దేశంలో 86,679 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


logo