ఒకే ఫుడ్ ఆర్డర్ పంపిణీకి క్యూకట్టిన 42 మంది సిబ్బంది

మనీలా: ఒక బాలిక ఫుడ్ యాప్‌లో చేసిన ఒక ఆర్డర్ డెలివరీకి 42 మంది సిబ్బంది ఆమె ఇంటికి క్యూకట్టారు. దీంతో ఏం జరిగిందో తెలియక ఆ బాలిక కంగారు పడింది. ఈ విచిత్ర ఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది. సిబూ నగరానికి చెందిన ఏడేండ్ల బాలిక నవంబర్ 25న తన బామ్మతోపాటు తన కోసం ఫ్రైడ్ చికెన్, రైస్‌ను మొబైల్ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. అయితే ఇంటర్నెట్ స్లోగా ఉండటంతో ఆర్డర్ ఎర్రర్ రావడంతో కన్ఫార్మ్ను పలుమార్లు నొక్కింది. దీంతో ఫుడ్ పాండాకు చెందిన 42 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ఒకరి తర్వాత ఒకరు 42 ఆర్డర్ పార్సిల్స్‌తో ఆ బాలిక ఇంటి వద్దకు వచ్చారు. జరిగిన పొరపాటును తెలుసుకున్న ఆ బాలిక ఆందోళన చెందింది. ఒక పార్సిల్‌కు ఆ దేశ కరెన్సీలో 189 పెసోలు చొప్పున మొత్తం 7945 పెసోలు చెల్లించాల్సి ఉండటంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.
మరోవైపు ఆ వీధిలో నివసించే డానీ అనే మహిళ దీన్ని తన ఫేస్బుక్ ఖాతాలో లైవ్‌లో ప్రసారం చేశారు. ఇంటర్నెట్ స్లో వల్ల యాప్‌లో తలెత్తిన సమస్య వల్ల బాలిక చేసిన పొరపాటు గురించి అందులో వివరించారు. ఆమెకు సహాయంగా నిలువాలని పొరుగువారిని కోరారు. స్పందించిన స్థానికులు ఆ ఆర్డర్స్‌లో చాలా వాటిని కొనుగోలు చేశారు. డెలివరీ సిబ్బంది కొందరు ఫుడ్ ఆర్డర్‌ను అక్కడే వదిలేసి డబ్బులు తీసుకోకుండానే వెళ్లిపోగా మరికొందరు కొన్ని ఆర్డర్లను రద్దు చేశారు. దీంతో బాలిక ఊరట చెందగా మరోవైపు ఈ ఘటనతో ఆమె పేరు ఆ నగరంలో మారుమోగింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక