గురువారం 04 జూన్ 2020
International - May 23, 2020 , 15:50:00

ఈ రోజు నేపాల్‌లో 41 కొత్త కరోనా కేసులు

ఈ రోజు నేపాల్‌లో 41 కొత్త కరోనా కేసులు

ఖాట్మండు: నేపాల్‌లో 41 కొత్త కరోనావైరస్‌ కేసులు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 548 కు చేరుకున్నాయి. దీంతో పాటు దేశంలో ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు చనిపోయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కపిలావాస్తు జిల్లాలో ఏడుగురు పురుషులు, ఒక మహిళతో మొత్తం ఎనిమిది మందిని పాజిటివ్‌గా గుర్తించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సర్లహి జిల్లాలో 13 మంది పురుషులు, బారా జిల్లాలో ఒక మహిళలకు, ఖాట్మండులో ఒక పురుషుడు కరోనా సాజిటివ్‌ ఉన్నట్లు తెలిపారు. రూపండేహి జిల్లాలో ఎనిమిది మంది, చిట్వాన్‌ జిల్లాలో మరొకరికి కరోనా సోకినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి వయస్సు 17 నుండి 52 సంవత్సరాల మద్యలో ఉన్నారు. ఈ కేసులన్నీ గత 24 గంటల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా నేపాల్‌ దేశంలో ఇప్పటివరకు మూడు మరణాలు సంభవించాయి. నేపాల్‌లో శుక్రవారం రాత్రికి మొత్తం తొమ్మిది మంది కరోనావైరస్‌ రోగులను మంత్రిత్వ శాఖ గుర్తించింది. దేశంలో కరోనా వ్యాధి నుంచి ఇప్పటివరకు మొత్తం 70 మంది రోగులు కోలుకున్నారు.


logo