బుధవారం 08 జూలై 2020
International - Jun 04, 2020 , 13:27:17

40 మంది స్కూల్‌ విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచాడు

40 మంది స్కూల్‌ విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచాడు

హైద‌రాబాద్‌:  చైనాలో దారుణం జ‌రిగింది. ఓ స్కూల్‌లో ఉన్న 40 మంది విద్యార్థుల‌ను ఓ సెక్యూర్టీ గార్డు క‌త్తితో పొడిచాడు.  విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్ల‌పైనా అత‌ను దాడి చేసిన‌ట్లు స్థానిక మీడియా పేర్కొన్న‌ది. గాంగ్జీ ప్రావిన్సులోని స్కూల్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం.  ఈ ఘ‌ట‌న సంబంధించిన పూర్తి వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది. నిందితుడిని 50 ఏళ్ల సెక్యూర్టీ గార్డుగా గుర్తించారు. స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు ఇత‌ర సెక్యూర్టీ గార్డులు కూడా ఈ దాడిలో గాయ‌ప‌డ్డారు.

గ‌త కొన్నేళ్లుగా చైనాలో కత్తితో దాడి చేసిన ఘ‌ట‌న‌లు పెరిగాయి. కింట‌ర్‌గార్డెన్‌, ప్రైమ‌రీ స్కూల్ విద్యార్థుల‌ను టార్గెట్ చేస్తూ దాడులు జ‌రుగుతున్నాయి.  ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ‌ద్ద కూడా దాడులు జ‌రుగుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాన‌సికంగా స‌రిగా లేని వ్య‌క్తులు ఇలాంటి దాడుల‌కు దిగుతున్న‌ట్లు చైనా స‌ర్వేలు చెబుతున్నాయి.


logo