సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 07, 2020 , 15:56:08

క్యాన్సర్‌ను జయించిన నాలుగేళ్ల చిన్నారి.. నవ్వులు చిందిస్తున్న ఫొటోలు వైరల్‌..!

క్యాన్సర్‌ను జయించిన నాలుగేళ్ల చిన్నారి.. నవ్వులు చిందిస్తున్న ఫొటోలు వైరల్‌..!

హైదరాబాద్‌: క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బయటపడడం అంటే దాదాపు చావు అంచులదాకా వెళ్లిరావడం అనే విషయం తెలిసిందే. అయితే, ఓ నాలుగేళ్ల చిన్నారి ఈ రోగాన్ని జయించింది. చిన్నారికి క్యాన్సర్‌ అని తెలిసి విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి ఆమె కోలుకోవడం పట్టలేని ఆనందాన్నిచ్చింది. దీంతో ఆమె తల్లి ఓ ఫొటోషూట్‌ నిర్వహించింది. చిన్నారి ఫొటోలు నెటిజన్ల హృదయాలను గెల్చుకున్నాయి.

లూలా బెత్ బౌడెన్ అనే నాలుగేళ్ల పాప క్యాన్సర్‌ బారినపడింది. 'విల్మ్స్ ట్యూమర్'తో బాధపడింది. ఇది మూత్రపిండంలో జరిగే ఒక రకమైన పీడియాట్రిక్ క్యాన్సర్. ఆమె లోపల దాదాపు ఫుట్‌బాల్ పరిమాణంలో కణితి పెరిగింది. అయితే, వైద్యులు శస్త్రచికిత్స సహాయంతో మొత్తం మూత్రపిండంతోపాటు ట్యూమర్‌ను తొలగించారు.  ఆ బాలికకు 22 వారాల వ్యవధిలో 13 రౌండ్ల కీమోథెరపీ చేశారు. ప్రస్తుతం చిన్నారి కోలుకొని చిరునవ్వులు చిందిస్తుండగా కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలారు. పాప అందమైన డ్రెస్‌లో నవ్వుతూ నిల్చున్న ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ‘నేను పోరాడాను.. నేను గెలిచాను.’ అని రాసి ఉన్న పలక పట్టుకున్న పాపకు చాలామంది శుభాకాంక్షలు తెలిపారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo