గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Sep 14, 2020 , 15:44:47

బ్రెజిల్‌లో క‌రోనాతో వారంలో 4వేల మంది మృతి

బ్రెజిల్‌లో క‌రోనాతో వారంలో 4వేల మంది మృతి

బ్ర‌సిలియా : బ్రెజిల్‌లో క‌రోనా కేసులతో పాటు మ‌ర‌ణాలు కూడా భారీగా న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన వారం రోజుల్లో 4వేల మంది వ్యాధి బారిన ప‌డి మృతి చెంద‌గా మ‌ర‌ణాల సంఖ్య 131,600 దాటింద‌ని దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం ఆల‌స్యంగా తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,768 కొత్త క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 415మంది మృతి చెందారు.  మొత్తం కేసుల సంఖ్య 4,330,455కు చేరుకోగా మ‌ర‌ణాల సంఖ్య 131,625కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 35లక్ష‌ల మంది రిక‌వ‌ర్ అయ్యారు. ప్రపంచంలోనే అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాలు క‌లిగిన రెండో దేశంగా బ్రెజిల్‌కు రికార్డు ఉంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo