సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 13:46:50

కరాచీలో భారత వ్యతిరేక ర్యాలీపై గ్రెనేడ్‌ దాడి..

కరాచీలో భారత వ్యతిరేక ర్యాలీపై గ్రెనేడ్‌ దాడి..

కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో గుల్షన్-ఇలో జమాత్-ఇ-ఇస్లామి (జేఐ) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన భారత వ్యతిరేక ర్యాలీపై గ్రెనేడ్ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ ట్రక్కు వెనుక నుంచి గ్రెనేడ్‌ విసరడంతో పేలుడు సంభవించి 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. గడేడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడాని నిరసిస్తూ ఈ ర్యాలీ జరిగింది. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉందని ప్రాణనష్టం జరగలేదని సింధ్ ఆరోగ్య మంత్రిత్వశాఖ మీడియా సమన్వయకర్త మీరన్ యూసుఫ్ తెలిపారు.

బాధితుల్లో ఐదుగురిని ముస్తఫా దవాఖానకు, ఏడుగురికి జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ (జేపీఎంసీ)కు, 11 మందిని అగాఖాన్ యూనివర్శిటీ దవాఖానకు, 10 మందిని లియాఖత్ నేషనల్ దవాఖానకు తరలించారు. దాడికి తామే బాధిత వహిస్తున్నట్లు నిషేధిత సింధుదేశ్ రెవల్యూషనరీ ఆర్మీ (ఎస్ఆర్ఎ) సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఇదిలాఉండగా నగరంలోని కోరంగి ప్రాంత పరిధిలోని నాసిర్‌ జంప్‌ ఏజన్సీ ఎస్టేట్‌లోని ఓ ఇంట్లో దుండగులు గ్రెనేడ్ విసిరి పారిపోయారు. గాయపడిన వారిని అధికారులు జేపీఎంసీకి తరలించారు.


logo