నైజర్: ఆఫ్రికా దేశం నైజర్ ( Niger ) లో కాల్పుల ఘటన జరిగింది. పశ్చిమ నైజర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 37 మంది మరణించారు. మోటార్‌బైక్‌లపై వచ్చిన సాయుధులు.. టిల్లాబేరి ప్రాంతంలో ఉన్న డారే డే గ్రామంలో దాడికి పాల్పడ్డారు.
సోమవారం మధ్యాహ్నం పొలాల్లో పనిచేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పశ్చిమ నైజర్ వద్ద బుర్కినో ఫాసో, మాలి దేశ సరిహద్దులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో జిహాదీ ఆల్‌ఖయిదా గ్రూపులు తరుచూ స్థానికులపై దాడి చేసి రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు కూడా అక్కడ బీభత్సం చేస్తున్నారు.