బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Feb 05, 2020 , 23:29:49

మంచు చరియలు విరిగిపడి 33 మంది సైనికులు మృతి

మంచు చరియలు విరిగిపడి 33 మంది సైనికులు మృతి

టర్కీ: మంచు చరియలు విరిగిపడి 33 మంది టర్కీ సైనికులు మృత్యువాత పడ్డారు. వివరాలు చూసినైట్లెతే, వాన్‌ ప్రాంతంలో మంచు చరియల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైనికులు వెళ్లారు. అదే సమయంలో మరోసారి భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 33 మంది సైనికులు మరణించారు. 53 మంది గాయపడ్డారు. ప్రమాదంపై స్థానికులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకొని మంచు చరియల్లో చిక్కుకున్న సైనికుల మృతదేహాలను, గాయపడిన వారిని వెలికితీస్తున్నారు. కాగా, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడబోయి, సైనికులు ప్రాణాలు కోల్పోవడం యావత్‌ ప్రపంచాన్ని ఒక్కసారిగా కలిచివేసింది. ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


logo
>>>>>>