శనివారం 24 అక్టోబర్ 2020
International - Sep 21, 2020 , 15:08:20

అతడి ఇల్లే ఓ చిట్టడివి..!

అతడి ఇల్లే ఓ చిట్టడివి..!

కాన్‌బెర్రా: అతడో ఆర్కిటెక్ట్‌. పట్టణంలో ఉండక తప్పని పరిస్థితి. కానీ అతడికి పట్టణం బోర్‌కొట్టేసింది. పల్లెటూరు వాతావరణం కావాలనుకున్నాడు. అర్బన్‌ లైఫ్‌లోనే విలేజ్‌ వాతావరణం సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తన ఇంటినే వేదికగా మార్చుకున్నాడు. ఇంట్లోనే ఓ చిట్టడివిని సృష్టించాడు. 

ఆస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్‌కు చెందిన జాసన్‌ చోగ్‌(32) ఆర్కిటెక్ట్‌. అతడికి పచ్చదనం అంటే ఇష్టం. కానీ పట్టణంలో ఎలా అని ఆలోచించాడు. వివిధ రకాల ప్యాంట్లను సేకరించి, అందులో మట్టినింపి మొక్కలు నాటాడు. మరికొన్నింటిని కుండీల్లో పెంచడం ప్రారంభించాడు. తన ఇంటిని 400 కి పైగా మొక్కలతో 'ఇండోర్ రెయిన్‌ఫారెస్ట్'గా మార్చాడు. ఇప్పుడు ఇళ్లంతా పచ్చదనంతో నిండిపోగా, ప్రతిరోజూ వాటినిచూస్తూ ఆనందంగా గడిపేస్తున్నాడు. ఈ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌ అయ్యాయి. అతడు ప్రతిరోజూ ఇన్‌స్టాలో మొక్కల ఫొటోలు కూడా పెడుతుంటాడు. దీనికి 18,000 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo