సోమవారం 18 జనవరి 2021
International - Jan 09, 2021 , 21:37:52

బాలకోట్ దాడుల్లో 300 మంది మృతి చెందారని పాక్‌ మాజీ దౌత్యవేత్త ఆఘా హిలాలీ అంగీకరించలేదు

బాలకోట్ దాడుల్లో 300 మంది మృతి చెందారని పాక్‌ మాజీ దౌత్యవేత్త  ఆఘా హిలాలీ అంగీకరించలేదు

ఇస్లామాబాద్‌: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలున్న బాలకోట్‌పై భారత వాయు సేన జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 300 మంది మరణించినట్లు  ఆ దేశ మాజీ దౌత్యవేత్త ఆఘా హిలాలీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదు. పాకిస్థాన్‌ టీవీ చర్చా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే ఆయన నాడు బాలకోట్‌ వైమానిక దాడుల్లో ఎవరూ చనిపోలేదన్నారు. తాజాగా తన మాటను మార్చారంటూ ఓ వీడియో సర్క్యులేట్‌ అయింది.  దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు  ఆయన అంగీకరించినట్లుగా వీడియోను మార్పింగ్‌ చేశారు. ఒరిజినల్‌ వీడియోలో ' కనీసం మూడు వందల మందిని చంపాలనుకున్నారు, కానీ చంపలేదు' అని మాత్రమే హిలాలీ అన్నారు.  చివరగా, బాలాకోట్ దాడుల్లో 300 మంది మృతి చెందినట్లు పాక్ మాజీ దౌత్యవేత్త హిలాలీ అంగీకరించలేదు.