శనివారం 06 జూన్ 2020
International - Apr 24, 2020 , 01:41:34

ఒక్క రోజే 30 వేల కేసులు

ఒక్క రోజే 30 వేల కేసులు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. బుధవారం ఒక్క రోజే దాదాపు 30 వేల కేసులు నమోదయ్యాయి. వరల్డ్‌ఓమీటర్‌ గణాంకాల ప్రకారం బుధవారం దేశంలో 29,972 కొత్త కేసులు నమోదయ్యాయి. 2,341 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 47,700కి చేరుకోగా, కేసుల సంఖ్య 8,50,000కు చేరింది. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికాపై దాడి జరిగిందని పేర్కొన్నారు. ‘మనపై దాడి జరిగింది. ఇది కేవలం ఫ్లూ కాదు. 1917 తర్వాత ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని తెలిపారు.logo