శనివారం 06 జూన్ 2020
International - Apr 06, 2020 , 10:26:00

అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా 30 క‌రోనా కేసులు

అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా 30 క‌రోనా కేసులు

కాబూల్: అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా మ‌రో 30 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఈ కేసులు న‌మోదైన‌ట్లు అప్ఘాన్ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. హీర‌త్ లో 16 కేసులు న‌మోదు కాగా..కాబూల్-6, నిమ్రుజ్-3, కుందుజ్-2, ఫ‌ర్యాబ్- 2, డైకుండి-1 కేసులున్న‌ట్లు పేర్కొంది. తాజాగా రికార్డైన కేసుల‌తో అప్ఘ‌నిస్థాన్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 367కు చేరుకుంది.

కొన్ని రోజులుగా క‌రోనా ప్ర‌భావం అధికంగా ఇరాన్ నుంచి అప్ఘ‌నిస్తాన్ లోని హెరాత్ ప‌ట్ట‌ణానికి కార్మికులు, ఇత‌ర వ‌ల‌స‌దారులు ట్యాక్సీలు, బ‌స్సులు, మినీ వ్యాన్ల‌లో వ‌స్తుండ‌టంతో ప‌శ్చిమ అప్ఘ‌నిస్థాన్ లో ర‌ద్దీ వాతావ‌ర‌ణం నెలకొంది. దీంతో అప్ఘ‌నిస్తాన్ లో క‌రోనా విజృంభించే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. మ‌రోవైపు అప్ఘ‌నిస్తాన్ లో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం అధికారులు, పోలీసుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. 

logo