గురువారం 28 మే 2020
International - Apr 16, 2020 , 07:43:55

మిలిటెంట్ల కాల్పుల్లో 30 మంది మృతి

మిలిటెంట్ల కాల్పుల్లో 30 మంది మృతి

బేని: కాంగోలో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. తూర్పు ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన రెండు కాల్పుల ఘటనల్లో 30 మంది మృతిచెందారు. అర్ధరాత్రి వేళ కోలి గ్రామ ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో కోడెకో వర్గానికి చెందిన దుండగులు దాడికి దిగారు. పడుకున్నవారిని పడుకున్నట్లుగానే కాల్చివేశారు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతులంతా హేమ జాతికి చెందినవారే కావడం గమనార్హం. కాగా,  బేనిలో జరిగిన మరో దాడిలో ఇద్దరు సైనికులు, ఓ పౌరుడు సహా అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఏడీఎఫ్‌) మిలిటెంట్‌ వర్గానికి చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. 1999 నుంచి ఇక్కడ రెండు వర్గాల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్నది.


logo