సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 17:15:45

చిన్నారిని గాల్లోకి లాక్కెళ్లిన గాలిప‌‌టం.. ఈదురు గాలులే కార‌ణం!

చిన్నారిని గాల్లోకి లాక్కెళ్లిన గాలిప‌‌టం.. ఈదురు గాలులే కార‌ణం!

సాధార‌ణంగా చిన్న‌పిల్ల‌లు గాలిప‌టాల‌ను ఎగుర‌వేస్తారు. ఇక్క‌డ మాత్రం ఓ చిన్నారిని గాలిప‌టం ఎగ‌రేసుకెళ్లింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా! నిజ‌మే! 21 సెకండ్ల‌ పాటు న‌డిచే ఈ వీడియో చూస్తే అస‌లు వాస్త‌వం బ‌య‌ట ప‌డుతుంది. తైవాన్‌లోని సించు న‌గ‌రంలో ఏటా ప‌తంగుల ఉత్సవాన్ని నిర్వ‌హిస్తారు. ఇటీవ‌ల జ‌రిగిన ఈ వేడుక‌కి చాలామంది పాల్గొన్నారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఒక ఆరెంజ్ క‌ల‌ర్ గాలిప‌టం గాల్లో ఎగురుతూ కింద‌కి వ‌చ్చి ఒక చిన్నారిని తీసుకెళ్లిపోయింది. ఈ సంఘ‌టన చూస్తే సినిమా సీన్ గుర్తొస్తుంది. రాక్ష‌సులు త‌మ దుష్ట శ‌క్తులు ప్ర‌యోగించి ఇలాంటి ప‌నులు చేస్తుంటారు.

అయితే ఇందులో ఎలాంటి మంత్రాలు, మాయ‌లు లేవు. ఆ ప్రాంతంలో వ‌చ్చే భారీ ఈదురు గాలుల కార‌ణంగా ఆ ప‌తంగి అమాంతం ఆ చిన్నారిని 100 అడుగులకు పైగా ఎత్తులోకి ఎగ‌రేసుకుపోయింది. సుమారు 19 సెకండ్ల‌పాటు 3 ఏండ్ల చిన్నారి గాలిలోనే ఉన్న‌ది. గాలి త‌గ్గ‌డంతో గాలిప‌టం కొంచెం కింద‌కి రాగా అక్క‌డున్న ప‌ర్యాట‌కులు దాన్ని నియ‌త్ర‌ణ‌లోకి తీసుకొని చిన్నారిని కింద‌కు దింపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. 

తాజావార్తలు


logo