సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 15, 2020 , 11:24:54

ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ప్ర‌స‌వం.. ఇలా జ‌ర‌గ‌డం చాలా అరుదు!

ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి ప్ర‌స‌వం.. ఇలా జ‌ర‌గ‌డం చాలా అరుదు!

ఇంట్లో ఒక కూతురు డెలివ‌రీ అయితేనే చాలా హ‌డావుడి ఉంటుంది. అదే ముగ్గురు కూతుళ్ల‌కు ఒకేసారి కాన్పు జ‌రిగితే ఇక ఆ ఇంట్లో ఎంత సంద‌డి, హ‌డావుడిగా ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ఇలాంటి వింత‌లు 5 కోట్ల మందిలో ఒక కుటుంబానికే సాధ్య‌మ‌వుతుంది అంటున్నారు.

దనీషా హయ్నెస్, ఎరియల్ విలియమ్స్, ఆస్లే హయ్నెస్ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు జులై 3న పురిటి నొప్పులతో ఒహియో మ్యాన్స్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో చేరారు. 4 గంట‌ల గ‌డువులోనే ఒక్కొక్క‌రిగా డెలివ‌రీ అయ్యారు. ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డ‌మ‌నేది చాలా అరుదు. ఈ రోజుల్లో ప్ర‌తిఒక్క‌రికీ సిజేరియ‌న్ ద్వారానే డెలివ‌రీ చేస్తున్నారు. కానీ వీరు మాత్రం స‌హ‌జ ప‌ద్ద‌తిలోనే జ‌న్మ‌నిచ్చారు. కాక‌పోతే వీరు ఇక్క‌డి వారు కాదండోయ్‌.. అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకున్న‌ది.logo