మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Jan 28, 2020 , 14:54:15

మాల్‌లో మహిళను పట్టుకున్నాడు...3 నెలల జైలు శిక్ష

మాల్‌లో మహిళను పట్టుకున్నాడు...3 నెలల జైలు శిక్ష

దుబాయ్‌:  ఓ మహిళను పట్టుకున్న భారతసంతతి వ్యక్తికి దుబాయ్‌లో మూడు నెలల శిక్ష విధించారు. 35 ఏళ్ల సిరియా మహిళ తన పిల్లలతో కలిసి మాల్‌లో షాపింగ్‌ కోసం వెళ్లింది. సదరు వ్యక్తి షాపింగ్‌ మాల్‌లో ఆ మహిళను తదేకంగా చూస్తూ ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఆ మహిళ బిగ్గరగా అరిచింది. దీంతో ఆ వ్యక్తి మహిళ చేతిని పట్టుకున్నాడు. మహిళ కేకలు వినడంతో షాపింగ్‌మాల్‌లో ఉన్నవారంతా అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచారమివ్వడంతో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన అతన్ని అరెస్ట్‌ చేశారు. లైంగికవేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు  ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరుచగా..అతనికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. జైలు శిక్ష పూర్తయిన తరువాత అతన్ని దేశం నుంచి పంపించను


logo