సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 21, 2020 , 19:38:21

భవనంలో పేలుడు ముగ్గురు దుర్మరణం.. 15 మందికి గాయాలు

భవనంలో పేలుడు ముగ్గురు దుర్మరణం.. 15 మందికి గాయాలు

కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో బుధవారం పేలుడు సంభవించింది. భవనంలోని రెండో అంతస్తులో జరిగిన పేలుడు ధాటికి ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. భవనం కిటికీలు, వాహనాలు దెబ్బతిన్నాయి. మస్కన్‌ చౌరంగి సమీపంలోని గుల్షన్‌-ఐ- ఇక్బాల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈదీ సంస్థ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని పటేల్‌ హాస్పటల్‌కు తరలించారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని, సిలిండర్‌ పేలిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు ముబినా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు అనుమనిస్తున్నారు. ఘటనా స్థలానికి బాంబు నిర్వీర్య బృందం చేరుకొని పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం షీరిన్‌ జిన్హా కాలనీలోని బస్టాండులో బాంబు పేలి ఐదుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.