బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 29, 2020 , 02:00:03

కాల్‌సెంటర్‌ స్కాంలో ముగ్గురు ఎన్నారైలకు జైలు

కాల్‌సెంటర్‌ స్కాంలో ముగ్గురు ఎన్నారైలకు జైలు

వాషింగ్టన్‌: అమెరికాలో సంచలనం సృష్టించిన ‘కాల్‌ సెంటర్‌ కుంభకోణం’ కేసులో ముగ్గురు ఎన్నారైలు మహమ్మద్‌ ఖాజిం మోహిన్‌, మహమ్మద్‌ సోజాబ్‌ మోహిన్‌, పలాంక్‌ కుమార్‌ పటేల్‌ సహా ఎనిమిదిమందికి ఆ దేశ కోర్టు జైలుశిక్ష విధించింది. సోమవారం కేసు విచారణ సందర్భంగా అమెరికా అటార్నీ బైయూంగ్‌ జే వాదనలు వినిపిస్తూ భారత్‌ కేంద్రంగా నడిచిన ఈ కాల్‌ సెంటర్‌ కుంభకోణం వల్ల తమ దేశ పౌరులకు 3.7 మిలియన్ల డాలర్ల (దాదాపు రూ.26.37 కోట్లు) నష్టం వాటిల్లిందని తెలిపారు. నిందితులు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. డాటా బ్రోకర్ల నుంచి పలువురు అమెరికన్ల సమాచారాన్ని సేకరిం చారు. ఆయా వ్యక్తులకు ఫోన్లు చేసి తాము ‘ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌' అధికారులమని చెప్పేవారు. ‘పన్నులు చెల్లించకుంటే జైలుకు పంపిస్తాం’ అంటూ బెదిరించి, డబ్బు వసూలు చేసేవారు. ఇలా వేలమంది అమెరికన్లను మోసం చేశారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ఎనిమిది మంది నిందితులకు జైలుశిక్ష విధించారు. ఇందులో ఆరు నెలల నుంచి నాలుగేండ్ల వరకు ఉన్నది.


logo
>>>>>>