బుధవారం 30 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 14:40:47

రోడ్డు వెంట గనిలో పేలుడు.. ముగ్గురు దుర్మరణం

రోడ్డు వెంట గనిలో పేలుడు.. ముగ్గురు దుర్మరణం

కాబుల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌ పచేరాగం జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా తెలిపింది.. పేలుడు ధాటికి రోడ్డు వెంట వెళ్తున్న వాహనం తునాతునకలు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డారని వెల్లడించింది. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆప్ఘనిస్థాన్‌లో వరుసగా ఇదే తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదులే ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo