సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 13:49:40

బాగ్దాద్‌లో రాకెట్ల దాడి.. ఐదుగురు దుర్మరణం

బాగ్దాద్‌లో రాకెట్ల దాడి.. ఐదుగురు దుర్మరణం

బాగ్దార్‌ : బాగ్దార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం మధ్యాహ్నం రాకెట్‌ దాడులు జరిగాయి. దాడుల్లో అల్బు-అమీర్‌ ప్రాంతంలో రెండిండ్లు కుప్పకూలడంతో ముగ్గురు చిన్నారులతో సహా ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు.  అల్‌జిహాద్‌ పొరుగు ప్రాంతాల నుంచి క్రిమినల్‌ గ్యాంగులు వీటిని ప్రయోగించినట్లు ఇరాకి సంయుక్త ఆపరేషన్‌ కమాండెంట్‌ తెలిపారు. ఇరాక్‌ ప్రధాని, ఆ దేశ భద్రతా దళాల కమాండెంట్‌ చీఫ్‌ ముస్తఫా అల్‌ ఖాధీమి దాడులను తీవ్రంగా ఖండించారు.

ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి దుండగులను అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. దాడులకు ఇంతకువరకు ఏ స్థానిక సంస్థ బాధ్యత వహించలేదు. ఇదిలాఉండగా బాగ్దార్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఇరాక్‌లోని అమెరికా భద్రతా దళాలను, గ్రీన్‌జోన్‌లోని అమెరికా రాయబారి కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇటీవల వరుసగా మోర్టార్, రాకెట్‌ దాడులు జరుగుతున్నాయి. దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే బాగ్దాద్‌లో అమెరికా రాయబారి కార్యాలయాన్ని మూసేస్తామని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో ఇటీవల ఇరాక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo