గురువారం 28 మే 2020
International - May 01, 2020 , 13:21:03

ఊడుతున్న ఉద్యోగాలు.. తిండికీ క‌ట‌క‌టే

ఊడుతున్న ఉద్యోగాలు.. తిండికీ క‌ట‌క‌టే

అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ విల‌యం కుదిపేస్తున్న‌ది. ల‌క్ష‌ల మంది వైర‌స్‌బారిన ప‌డి, వేల‌మంది చ‌నిపోవ‌ట‌మే కాకుండా ఆరోగ్యంగా ఉన్న‌వారు కూడా తిండి దొర‌క్క అల‌మ‌టిస్తున్నారు. దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ఏకంగా మూడు కోట్ల 30 ల‌క్ష‌ల మంది నిరుద్యోగ భృతికోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్క‌లే ఆ దేశంలో ఆక‌లికేక‌లు ఏ స్తాయిలో ఉన్నాయో చెపుతున్నాయి. 1930 త‌ర్వాత అమెరికా ఈ స్థాయిలో అమెరికా క‌ష్టాలు ప‌డ‌టం ఇదే మొద‌టిసారి. గ‌త‌వారం మూడు ల‌క్ష‌ల 80వేల మంది ప్ర‌భుత్వం అందించే నిరుద్యోగ భృతికోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌టంతో మొత్తం నిరుద్యోగ భృతి ద‌ర‌ఖాస్తుదారుల సంఖ్య మూడు కోట్లు దాటింది. దేశంలో ప్ర‌తి ఆరుగురు ఉద్యోగుల్లో ఒక‌రు గ‌త ఆరు వారాల్లో ఉద్యోగం కోల్పోయారు. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు ఏకంగా 20శాతానికి చేరింద‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 1930 ద‌శ‌కంలో వ‌చ్చిన మ‌హామాంద్యం స‌మ‌యంలో అమెరికాలో నిరుద్యోగ రేటు 25శాతానికి పెరిగింది. ఆ త‌ర్వాత 20శాతం దాట‌డం ఇదే మొద‌టిసారి. 

అయితే ప్ర‌భుత్వం వారం వారం సేక‌రించే నిరుద్యోగ లెక్క‌ల కంటే వాస్త‌వ నిరుద్యోగ రేటు ఎక్కువ‌గా ఉంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మార్చి మ‌ధ్య నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మూడున్న‌ర కోట్ల ఉద్యోగాలు పోయాయ‌ని అమెరికా ఆర్థికవేత్త‌లు అలెగ్జాండ‌ర్ బిక్‌, ఆడెం బ్లాండిన్ తెలిపారు. మ‌రో 12 మిలియ‌న్ల మంది ఉద్యోగాలు కోల్పోయినా నిరుద్యోగ భృతికోసం ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని ఎక‌న‌మిక్ పాల‌సీ ఇన్‌స్టిట్యూట్ నిర్వ‌హించిన స‌ర్వేలో తేలింది. దీన్నిబ‌ట్టి చూస్తే దేశంలో నిరుద్యోగ‌భృతిదారుల సంఖ్యను చాలా త‌క్కువ చేసి చూపిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ద‌ని ఆర్థిక‌వేత్తలు బెన్‌జిప్ప‌ర‌ర్ ఎలైస్ గోల్డ్ అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. ‌logo