శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 03, 2020 , 08:32:39

భూటాన్‌లో భూప్రకంనలు..

భూటాన్‌లో భూప్రకంనలు..

థింపూ : భూటాన్‌ రాజధాని థింపూలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.7గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) తెలిపింది. థింపూనకు దక్షిణంగా 82 కిలోమీటర్ల దూరంలో నైరుతిదిశగా భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనతో జనాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.