శుక్రవారం 05 జూన్ 2020
International - May 10, 2020 , 16:13:18

అమెరికాలో ౩,౩౦౦ మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

అమెరికాలో ౩,౩౦౦ మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇందు గలడందు లేడని సందేహం వలదు.. అన్నట్లుగా కరోనా వైరస్‌ ఎక్కడెక్కడో వ్యాపిస్తూ తీవ్రంగా భయపెడుతున్నది. సెంట్రల్‌ కాలిఫోర్నియా జైలులోని ఖైదీలకు ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా.. దాదాపు 792 మందిలో పాజిటివ్‌గా తేలింది. అమెరికాలో అన్ని జైళ్లలో కలిపి దాదాపు 70 శాతం మంది ఖైదీలకు కరోనా వ్యాపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఖైదీలతోపాటు పదకొండు మంది జైలు ఉద్యోగులకు కూడా కొవిడ్‌-19 పాజిటివ్‌ తేలడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. ఖైదీలకు చికిత్స అందించేందుక జైలు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మిలటరీ మొబైల్‌ దవాఖానను ప్రారంభించి కరోనా పాజిటివ్‌ ఖైదీలకు చికిత్స అందిస్తున్నారు. ది టర్మినల్‌ ఐలాండ్‌ కరెక్షనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా.. 644 మంది ఖైదీల్లో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయని అక్కడి అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలోని అన్ని జైళ్లలో కలిపి 3,300 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఫెడరల్‌ కరెక్షనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది.


logo