గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 15:26:44

రోడ్డు మీద 29 వేల కిలోల‌‌‌ క్యారెట్లు.. ఎందుకంటే!

రోడ్డు మీద 29 వేల కిలోల‌‌‌ క్యారెట్లు.. ఎందుకంటే!

ఏ సీజ‌న్‌లో అయినా క్యారెట్ల‌కు మంచి గిరాకీ ఉంటుంది. వాటి వ‌ల్ల రైతులు ఎప్పుడూ న‌ష్ట‌పోరు. కానీ 29 ట‌న్నుల క్యారెట్ల‌ను ఎందుకు రోడ్డు మీద ప‌డేశారో తెలియ‌క చాలామంది ఫొటోలు తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎందుకు క్యారెట్ల‌ను రోడ్డు మీద ప‌డేస్తున్నార‌'ని ప్ర‌శ్నిస్తున్నారు. ద‌క్షిణ లండ‌న్‌లోని గోల్డ్ స్మిత్స్ కాలేజీ ముందు లారీ ద్వారా 29,000 కిలోల క్యారెట్ల‌ను రోడ్డు  మీద వేశారు. నెటిజ‌న్ల ప్ర‌‌శ్న‌ల‌కు గోల్డ్ స్మిత్స్ కాలేజీ స్పందించింది. 

ఈ క్యారెట్లు ఒక స్టూడెంట్ ఆర్ట్ ఇన్‌స్టాలేష‌న్‌లో భాగ‌మ‌ని వివ‌రించారు. క‌ళాశాల ఎమ్ఎఫ్ఏ డిగ్రీ ప్ర‌ద‌ర్శ‌న‌లో సంస్థాప‌న ఒక భాగ‌మ‌ని క‌ళాశాల వెల్ల‌డించింది. 'ఈ సంస్థాప‌న‌ను ఆర్టిస్ట్, ఎమ్ఎఫ్ఏ విద్యార్థి రాఫెల్ పెరెజ్ ఎవాన్స్  'గ్రౌండింగ్'‌‌ అని అంటారు. ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత క్యారెట్ల‌ను తొల‌గించి జంతువుల‌కు దానం చేస్తార‌ని స‌మాచారం. కొంత‌మంది విద్యార్థులు క్యారెట్ల‌కు ఇంటికి కూడా తీసుకెళ్లారు.     


logo