సోమవారం 30 మార్చి 2020
International - Mar 20, 2020 , 14:57:06

ఉగ్రవాదుల దాడుల్లో 29 మంది సైనికులు మృతి

ఉగ్రవాదుల దాడుల్లో 29 మంది సైనికులు మృతి

బమాకో : పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశంలో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారించారు. ఈశాన్య మాలీలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదులు దాడులు జరిపిన ప్రాంతాన్ని పోలీసులు దిగ్భంధం చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొన్నేండ్ల నుంచి మాలీలో ఉగ్రవాదుల చర్యల వల్ల వర్గపోరు నడుస్తుందని అక్కడి అధికారులు తెలిపారు. 


logo