శనివారం 06 జూన్ 2020
International - May 05, 2020 , 13:14:25

థాయిలాండ్‌లో తెరుచుకున్న 28 విమానాశ్ర‌యాలు

థాయిలాండ్‌లో తెరుచుకున్న 28 విమానాశ్ర‌యాలు

బ్యాంకాక్‌:  సివిల్ ఏవియేష‌న్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్‌(సీఏఏటీ) డొమ‌స్టిక్ విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. థాయిలాండ్‌లో మొత్తం 28 ఎయిర్‌పోర్టుల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మే 1వ తేదీ నుంచే కొన్ని విమానాలు న‌డుస్తున్న‌ట్లు జిన్‌హెవా వార్త‌సంస్థ తెలిపింది. అయితే విమానాలు న‌డిపేందుకు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చిన‌ట్లు సీఏఏటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ చులాసుక్మ‌నోప్ తెలిపారు.

 ఎయిర్‌పోర్టుల్లోకి అత్య‌వ‌స‌ర‌, సాంకేతిక సిబ్బంది, మెడిక‌ల్ సిబ్బంది, స్వ‌దేశాల‌కు వెళ్లే వారికి న‌డుపుతున్న ప్ర‌త్యేక విమానాలు, కార్గో విమానాలు త‌ప్పితే ఇత‌ర ఎటువంటి అంత‌ర్జాతీయ స‌ర్వీసులు అనుమ‌తించ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌యాణికులంద‌రికి విమానాశ్ర‌యాల్లో ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుందని, కోవిడ్ 19 వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. ఏప్రిల్ ‌ప్రారంభం నుంచి థాయిలాండ్ ప్ర‌భుత్వం విమానాల రాక‌పోక‌ల‌పై నిషేదం విధించింది. మే ప్రారంభం నుంచి కోవిడ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో క‌ర్ప్యూ నిబంధ‌న‌లు స‌డ‌లించారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌లు ధ‌రించ‌డం త‌ప్ప‌ని స‌రి చేశారు. 


logo