గురువారం 21 జనవరి 2021
International - Dec 03, 2020 , 08:18:25

అమెరికాలో కరోనా విలయం.. ఒకేరోజు 2731 మంది మృతి

అమెరికాలో కరోనా విలయం.. ఒకేరోజు 2731 మంది మృతి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దేశంలో నిన్న ఒక్కరోజే 2731 మంది మహమ్మారికి బలవగా, కొత్తగా 1,95,121 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది. ఇందులో 55,71,729 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 84,62,347 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా బారినపడి చనిపోయినవారి సంఖ్య  2,79,763కు చేరింది. నిన్న 2731 మంది మరణించడంతో.. ఏప్రిల్‌ తర్వాత ఇంత పెద్దసంఖ్యలో బాధితులు మృతిచెందడం ఇదే మొదటిసారి. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 6,48,03,583కు చేరుకోగా.. మరణాల సంఖ్య 14,98,190కు పెరిగింది. మరో 1,84,00,925 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,49,34,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మొదటిస్థానంలో ఉండగా, భారత్‌, బ్రెజిల్‌, రష్యా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, యూకే తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. 


logo