బుధవారం 27 జనవరి 2021
International - Nov 28, 2020 , 15:45:06

ర‌ష్యాలో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

ర‌ష్యాలో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

మాస్కో: ర‌ష్యాలో క‌రోనా వైర‌స్ ఉధృతి ఇంకా త‌గ్గ‌డంలేదు. అక్క‌డ ప్ర‌తిరోజు 20 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కూడా ర‌ష్యాలో కొత్త‌గా 27,100 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ర‌ష్యాలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,42,633కు చేరింది. ఒక్క‌ రష్యా రాజ‌ధాని మాస్కోలోనే 7,320 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ 3,695 కొత్త కేసుల‌తో మాస్కో త‌ర్వాత స్థానంలో ఉన్న‌ది. క‌రోనా మ‌ర‌ణాలు కూడా ర‌ష్యాలో భారీగానే న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 510 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 39,068కి పెరిగింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo