శనివారం 30 మే 2020
International - May 07, 2020 , 13:02:11

హాంకాంగ్ చ‌రిత్రలో తొలిసారి..భారీగా షార్క్ ఫిన్స్ సీజ్

హాంకాంగ్ చ‌రిత్రలో తొలిసారి..భారీగా షార్క్ ఫిన్స్ సీజ్

హాంకాంగ్ ‌: హాంకాంగ్ క‌స్ట‌మ్స్ అధికారులు భారీ మొత్తంలో అతిపెద్ద షార్క్ ఫిన్స్ (వాజాలు) స్వాధీనం చేసుకున్నారు. అంత‌రించిపోయే ద‌శ‌లో ఉన్న 38500 షార్క్ చేపల నుంచి సేక‌రించిన 26 ట‌న్నుల షార్క్ వాజాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దక్షిణ‌మెరికా నుంచి వ‌స్తోన్న రెండు షిప్ కంటైన‌ర్ల‌లో వీటిని గుర్తించారు. 

వీటి ధ‌ర బ‌హిరంగ మార్కెట్ లో 1.1 మిలియ‌న్ డాల‌ర్లుంటుంద‌ని అంచ‌నా. ఇది 2019 హాంకాంగ్ లో సీజ్ చేసిన 12 షార్క్ ఫిన్స్ తో పోలిస్తే రెండు రెట్ల కంటే ఎక్కువ‌. ఇంత పెద్ద మొత్తంలో షార్క్ ఫిన్ష్ సీజ్ చేయ‌డం హాంకాంగ్ చ‌రిత్ర‌లో తొలిసారి అని క‌స్ట‌మ్స్ , ఎక్సైజ్ డిపార్టుమెంట్ అసిస్టెంట్ సూప‌రింటెండెంట్ డానీ చెవుంగ్ కేవోక్‌-యిన్ తెలిపారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo