మంగళవారం 26 మే 2020
International - Apr 29, 2020 , 15:52:48

వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్నిప్ర‌మాదం.. 25 మంది మృతి

వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్నిప్ర‌మాదం.. 25 మంది మృతి


హైద‌రాబాద్: ద‌క్షిణ‌కొరియాలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఇచియాన్‌లో జ‌రిగిన ఆ ప్ర‌మాదంలో 25 మంది చ‌నిపోయారు. నిర్మాణంలో ఉన్న‌ వేర్‌హౌజ్ బిల్డింగ్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దాంట్లో ప‌నిచేస్తున్న కూలీలు అక్క‌డికక్క‌డే చ‌నిపోయారు. నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో అనుకోని పేలుడు సంఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. గాయ‌ప‌డ్డ‌వారి కోసం రెస్క్యూ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు.  .


logo