గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 25, 2020 , 23:16:29

జపాన్‌లో వడదెబ్బతో 25 మంది మృతి

జపాన్‌లో వడదెబ్బతో 25 మంది మృతి

టోక్యో: జపాన్‌ను ఎండలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వడదెబ్బతో 25 మంది మృతి చెందినట్లు ఆ దేశ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సంస్థ మంగళవారం ప్రకటించింది. అలాగే, 12,800 మంది మంచంపట్టారని వివరించింది.  45.4 శాతం మంది ఇంట్లో ఉన్నప్పుడు, 17 శాతం మంది పనిలో ఉన్నప్పుడు ఎండవేడిమితో ఇబ్బందులుపడ్డారని తెలిపింది. 

వైద్యసహాయం కోసం అంబులెన్స్‌లకు కాల్‌ చేశారని ఏజెన్సీ వెల్లడిచింది. 12,800 కాల్స్‌లో, దాదాపు 4,000 మంది వృద్ధుల నుంచే వచ్చాయని తెలిపింది. 387 మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉందన్నారు.  టోక్యో, ఇతర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ (100.4 డిగ్రీల ఫారెన్‌హీట్) వరకు నమోదైనట్లు తెలిపింది. గతేడాది ఎండదెబ్బ తగిలి 126 మంది మరణించారు. 70,000 మందికి పైగా వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలతో దవాఖాన పాలయ్యారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo