బుధవారం 03 జూన్ 2020
International - Apr 16, 2020 , 12:55:52

24 మంది మ‌హిళా డాక్ట‌ర్ల డ్యాన్స్..వీడియో వైర‌ల్

24 మంది మ‌హిళా డాక్ట‌ర్ల డ్యాన్స్..వీడియో వైర‌ల్

కేర‌ళ‌:  క‌రోనా వైర‌స్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌స్తుతం డాక్ల‌ర్లంతా ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌ర్తిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విధులు ముగిసిన త‌ర్వాత కొంత‌మంది డాక్ల‌ర్ల బృందం ఓ భ‌క్తి పాట‌కు డ్యాన్స్ చేశారు.

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్నా..ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా ముందుండి ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుతున్న వైద్య‌సిబ్బందిలో మ‌నోధైర్యాన్ని నింపేందుకు లోకం ముఝువ‌న్ సుఖం ప‌క‌ర‌న్ భ‌క్తి పాట‌కు ఎస్ కే ఆస్ప‌త్రికి చెందిన 24 మంది మ‌హిళా డాక్ల‌ర్లు నృత్యం చేసి అల‌రిస్తున్నారు. అన‌స్థీటిస్ట్ డాక్ట‌ర్ శ‌ర‌ణ్య కృష్ణ‌న్ ఈ పాట‌కు నృత్య రీతుల‌ను స‌మ‌కూర్చ‌గా..మిగిలిన బృందం అంతా ఆమెను ఫాలో అవుతూ భ‌క్తి పాట‌కు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo