గురువారం 04 జూన్ 2020
International - Apr 03, 2020 , 12:38:57

క‌రోనా ఎఫెక్ట్‌: సౌదీ సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా ఎఫెక్ట్‌: సౌదీ సంచ‌ల‌న నిర్ణ‌యం

 రియాద్‌: గ‌ల్ఫ్ దేశాల్లోనూ మ‌హ‌మ్మారి క‌రోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రకటించింది. మ‌క్కా, మ‌దీనా ప్రాంతాల్లో తిరిగే కార్లలో ఒకే వ్యక్తి మాత్రమే ప్రయాణం చేయాలని స్పష్టం చేసింది. సౌదీలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన వారి సంఖ్య 1,885 చేర‌గా.. 21 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ వ్యాప్తి, నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టికే సౌదీ కఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. అక్క‌డి ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను కూడా విధించింది.  అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను పూర్తిగా ర‌ద్దు చేసింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మక్కా, మదీనాకు వచ్చేవాళ్లు ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని తెలిపింది. అటు ఇప్ప‌టికే ఉమ్రా యాత్ర‌ను ఏడాది పొడవునా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సౌదీ స‌ర్కార్‌..తాము స్పష్టతనిచ్చేవరకు ట్రావెల్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవద్దని సూచించింది. అయితే  కార్మికులు, ప్రజలు నిత్యావ‌స‌ర స‌రుకులు కొనుగోలు చేయ‌డానికి, వైద్యం కోసం కొన్ని మినహాయింపులు ఇస్తూ సౌదీ ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది.



logo