ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 26, 2020 , 17:23:32

ఇరాన్‌లో కొత్తగా 2333 కరోనా కేసులు

ఇరాన్‌లో కొత్తగా 2333 కరోనా కేసులు

టెహ్రాన్‌ : ఇరాన్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. వేలల్లో కేసులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 216 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 15,700కు చేరింది. ఇదిలా ఉండగా తాజాగా అక్కడ 2,333 కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 291,172కు చేరిందని ఆదివారం ఆరోగ్య శాఖ తెలియజేసింది. మే నుంచి అక్కడ కరోనా కేసులు పెరుగుదల కొనసాగుతూనే ఉంది. 

అయితే ఏప్రిల్‌లో ఇరాన్‌ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించింది అప్పటి నుంచి కేసులు మరింతగా పెరుగుతున్నాయి. అన్‌లాక్‌లో భాగంగా మసీదులు, షాపింగ్ కేంద్రాలు, పబ్లిక్ పార్కులను తిరిగి తెరిచింది. 

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రజా రవాణా, రద్దీ ప్రాంతాల్లో జనం మాస్కులు ధరించాలని అధ్యక్షుడు ఇరాన్‌ అధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. టెహ్రాన్‌లోని న్లోని అధికారులు కొన్ని వ్యాపారాలు మరియు బహిరంగ సభలపై తిరిగి ఆంక్షలు విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo