శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 06, 2020 , 16:48:17

చైనా నుంచి స్వదేశానికి 233 మంది భారతీయులు

చైనా నుంచి స్వదేశానికి 233 మంది భారతీయులు

బీజింగ్‌: చైనాలోని 233 మంది భారతీయులు గురువారం ప్రత్యేక విమానంలో భారత్‌కు ప్రయాణమయ్యారు. వీరిలో ఎక్కువ మంది చైనాలోని పలు నగరాల్లో చదువుతున్న విద్యార్థులేనని చైనాలోని భారత రాయబారి తెలిపారు. వందే భారత్‌ మిషన్‌లో భాగంగా ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో గ్వాంగ్జౌ నుంచి ఢిల్లీకి గురువారం మధ్యాహ్నం వారు బయలుదేరినట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌ కింద ఇప్పటికే నాలుగు విడతలు పూర్తికాగా ఈ నెల నుంచి ఐదో విడత తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది.logo