గురువారం 09 జూలై 2020
International - May 24, 2020 , 16:27:19

సియోల్ నైట్‌క్ల‌బ్‌ల‌తో 225 మందికి క‌రోనా!

సియోల్ నైట్‌క్ల‌బ్‌ల‌తో 225 మందికి క‌రోనా!

న్యూఢిల్లీ: దక్షిణకొరియా రాజధాని సియోల్‌లోని నైట్‌క్లబ్‌ల కారణంగా ఇప్పటివరకు 225 మందికి కరోనా వైరస్‌ సోకింది. మే నెల మొదట్లో 29 ఏండ్ల‌ యువకుడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. సియోల్‌లో అత‌డు మొత్తం మూడు నైట్‌క్లబ్‌లకు వెళ్లిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రదేశాల‌కు సమీపంలో దాదాపు 10 వేల మంది ఉన్నట్లు గుర్తించిన దక్షిణకొరియా ప్రభుత్వం అప్రమత్తమై అందరికీ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టింది. 

ఏప్రిల్‌ 24 నుంచి మే 6 మధ్యలో ఆ మూడు నైట్‌క్లబ్‌లు, పరిసర ప్రాంతాలను సందర్శించిన వారిని మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గుర్తించిన ద‌క్షిణ‌కొరియా ప్ర‌భుత్వం అంద‌రికీ సంక్షిప్త సందేశాలను పంపింది. వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ది. ఇప్పటివరకు 225 మందికి కరోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు నిర్ధారించారు. దక్షిణకొరియా ప్ర‌భుత్వం లాక్‌డౌన్ నిబంధ‌న‌లు సడలించిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 


logo