శనివారం 04 ఏప్రిల్ 2020
International - Feb 20, 2020 , 09:33:59

2118కి చేరిన కోవిడ్‌19 మృతుల సంఖ్య‌

2118కి చేరిన కోవిడ్‌19 మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 వ్యాధి వ‌ల్ల చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2118 మంది మృతిచెందారు.  బుధ‌వారం ఒక్క రోజే ఆ దేశంలో 394 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ప్రాణాంత‌క వైర‌స్ వ‌ల్ల‌ నిన్న ఒక్క రోజే 114 మంది చ‌నిపోయారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సోకిన కేసులు 74 వేల 576కు చేరుకున్నాయి.  హాంగ్‌కాంగ్‌లో 65 మంది, మ‌కావ్‌లో ప‌ది, తైవాన్‌లో 24 మందికి వైర‌స్ సోకింది. ఇంకా 11 వేల మంది క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉన్నారు. మ‌రోవైపు జ‌పాన్ తీరంలో నిలిచిన డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు కోవిడ్‌19 వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.


logo