న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తికలిగిన సంస్థ అయిన టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగివారు సంబంధిత సర్టిఫికెట్లతో వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో పంప్ ఆపరేటర్, ఫైర్‌మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 19
ఇందులో పంప్ ఆపరేటర్ 4, ఫైర్‌మెన్ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి పాసవడంతోపాటు ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఫైర్‌మెన్ పోస్టుకు సంబంధిత రంగంలో సర్టిఫికెట్‌తోపాటు, ఏడాదిపాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఇంటర్వ్యూ తేదీ నాటికి 27 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
ఇంటర్వ్యూ తేదీ: మే 12
మెయిల్: https://tmc.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి