శుక్రవారం 05 జూన్ 2020
International - May 23, 2020 , 17:28:59

కటింగ్‌బ్లేడ్‌తో దంతాన్ని తీసేసింది

కటింగ్‌బ్లేడ్‌తో దంతాన్ని తీసేసింది

2020 ఏడాది అసలు బాగులేదంటున్నది ఇంగ్లాండ్‌కు చెందిన ది ఫే రేవార్డ్‌. ఏడాది మొదటి నుంచి కరోనా నుంచి తప్పించుకుంటుంటే.. ఇప్పుడు కొత్తగా పంటినొప్పి ఒకటి మొదలైంది. ఇది ప్రసవం నొప్పికంటే దారుణంగా ఉందని చెప్పుకొచ్చింది. పంటిని తీసివేయడానికి డాక్టర్‌ను సంప్రదించాలనుకున్నది. బయటకు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ఫేస్‌బుక్‌ ద్వారా డాక్టర్‌ అపాయిట్‌మెంట్‌ ప్రయత్నించింది. కానీ విఫలమయింది. దీంతో డాక్టర్‌ సలహా తీసుకొని తానే స్వయంగా దంతాన్ని తీసేయాలని నిర్ణయించుకున్నది. కటింగ్‌ బ్లేడ్‌ తీసుకొని దంతాన్ని తొలిగిస్తున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈమె సాహసానికి, ధైర్యానికి సలాం కొడుతున్నారు నెటిజన్లు. దంతాన్ని తొలిగించినప్పటి నుంచి ఉపశమనంగా ఉందని రేవార్డ్‌ చెప్పుకొచ్చింది. logo