బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 10, 2020 , 03:12:48

బైడెన్‌ గెలుపును గుర్తించని రష్యా, చైనా

బైడెన్‌ గెలుపును గుర్తించని రష్యా, చైనా

బీజింగ్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపును రష్యా, చైనా ఇంకా గుర్తించటం లేదు. ఎన్నికలపై న్యాయపరమైన సవాళ్లు తొలిగిపోయేంతవరకు  బైడెన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శుభాకాంక్షలు తెలుపరని ఆ దేశ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ సోమవారం స్పందిస్తూ.. ‘మాకు తెలిసినంతవరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచినట్టు బైడెన్‌ ప్రకటించుకున్నారు. తుది ఫలితాన్ని మాత్రం అమెరికా చట్టాలు, కోర్టులే తేలుస్తాయని భావిస్తున్నాం. ఇలాంటి విషయాల్లో మేము అంతర్జాతీయ సూత్రాలను అనుసరిస్తాం’ అని పేర్కొన్నారు. 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ను ఎన్నుకొంటూ అమెరికా ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని ఇంకా అంగీకరించలేదు.